కారంచేడు సమీపంలోని కొమ్మమూరు కాలువలో గురువారం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు రాగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ జి. శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించి శవ పంచనామా పూర్తి చేశారు. కాగా మృతుడిని గుర్తించడానికి ఎటువంటి ఆనవాళ్లు లేవని, కాలువ ఎగువభాగం నుండి ఈ మృతదేహం కొట్టుకు వచ్చిందని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.