ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెపై అభియోగాలు కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆమెకు నోటీసులు ఇచ్చింది. శ్రీలక్ష్మీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వైఎస్ హయాంలో ఓఎంసీకి ఆమె 2007లో అక్రమంగా గనులు కేటాయించారంటూ సీబీఐ కేసులు నమోదు చేసింది.