బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన రాజరాజేశ్వరిదేవి అమ్మవారు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని వరలక్ష్మిదేవిగా పూజలు అందుకున్నారు. అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి విశేష కుంకుమ పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అలాగే తులసి దళములతో లక్ష్మీ సహస్ర నామ పూజ జరిపారు. తొమ్మిది రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు.