ఓట్ల తొలగింపుపై టీడీపీ, ఆ పార్టీని నడుపుతున్న రామోజీరావుతో పాటు మరో పత్రిక, ఇతర మీడియా సంస్థలు రంకెలు వేస్తున్నాయని, టీడీపీ క్రియేట్ చేస్తున్న గందరగోళం చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ అన్నట్టుగా ఉందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉరవకొండలో ఓట్ల తొలగింపులో సరైన ప్రొసీజర్ ఫాలో కాని ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిందని చెప్పారు. ఉరవకొండలో అక్రమాలంటూ ఈనాడు రామోజీరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. తప్పుడు పనులు చేయడం తప్ప మరే అలవాటు లేని టీడీపీ.. అధికారంలో ఉండగా ఆధారాలతో సహా అడ్డంగా దొరికినవారు పతివ్రత కబ్లుర్లు చెప్పడం, అధికార వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోందని సజ్జల అన్నారు.