గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. గురువారం అనంతపురం జిల్లా కుందుర్పి, అపిలేపల్లి, మలయనూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను మంత్రి ఉషాశ్రీచరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాల వ్యవస్ధ ద్వారా నిజం చేశారన్నారు. సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా నేరుగా అందిస్తున్నాం అని తెలిపారు.