గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగినవారు, కల్మషం లేని మనుషులు అని సీఎం జగన్ కొనియాడారు. మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగుకు సాలూరు నుంచి బీజం పడింది. మనం ఈరోజు శంకుస్థాపన చేసిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ రాబోయే రోజుల్లో గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రూ.834 కోట్లతో మూడు సంవత్సరాల్లో జాతికి అంకితం చేయబోయే గొప్ప ప్రాజెక్టుకు అడుగు వేశాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులోని మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్‌తో కలిసి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు.