తండ్రీకొడుకులు నోరు తెరిస్తే.. తంతాం, నరుకుతాం, పొడుస్తాం, తోలు తీస్తాం, చంపేస్తాం ఇవే మాటలు.. ప్రజాస్వామ్యంలో ఈ భాషను ఎవరైనా అంగీకరిస్తారా..? టీడీపీలో అంతా సంఘ వ్యతిరేక శక్తులే. నాయకుడు గూండానే.. గూండాయిజం, రౌడీయిజం, హంతకులు అంతా కలిసిన పార్టీ టీడీపీ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వివిధ సామాజిక వర్గాలకు గతంలో ఏం చెప్పారు.. ఏం చేశారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పేరును మార్చుకుంటే బాగుంటుందని విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు.. టీడీపీని కాస్త జీటీపీ (గెలిస్తే తంతాం పార్టీ) అని మార్చుకుంటే బాగుంటుందని చురకలు అంటించారు.