నారా లోకేష్, యువగళం పాదయాత్రపై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కుక్కలు మొరిగినట్లు టీడీపీ నేతలు మొరుగుతున్నారు. కర్రలు తీసుకుంటే కుక్కలు పారిపోయినట్లు టీడీపీ నేతలు పారిపోతున్నారు. నేను నీ ఇంటికే వచ్చా మీ నాన్న పారిపోయాడు. జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. గన్నవరం సభ ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉంది. మీ అయ్యనే ఉరికించాం.. నువ్వు ఎంత లోకేష్. లోకేష్ నోరు అదుపులో పెట్టుకో. పాదయాత్ర అంటే ఏంటో వైఎస్ఆర్, వైఎస్ జగన్ని చూసి నేర్చుకో. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారు. బౌన్సర్స్ని పెట్టుకుని చేయడం కాదు యాత్ర అంటే. పాదయాత్ర అంటే పేటెంట్ వైఎస్ఆర్, జగన్కు మాత్రమే ఉంది. నేను చంద్రబాబు ఇంటికే వెళ్లాను.. నువ్వు టైం చెప్పు.. ప్లేస్ చెప్పు మళ్లీ నీ దగ్గరకు వస్తాం. వారాహి యాత్ర చేసినా, పాదయాత్ర చేసినా మీరు మళ్లీ అధికారంలోకి రారు.’’ అంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.