వాన్‌పిక్ కేసులో ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వాన్‌పిక్ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. వాదనలు విన్న ఉన్నతన్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ, ఉత్తర్వులు ఇచ్చే వరకు 'స్టేటస్ కో' అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది.