ఈ నెల 28 న ఢిల్లీలో జరగనున్న ఎన్టీఆర్ కాయిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. అర్హత ఉన్న వారి ఓట్లను తొలగించడం చాలా తప్పని అన్నారు. ఒక వర్గం, ఒక పార్టీ వారిగా గుర్తించి ఓట్లు తొలగించడం కరెక్టు కాదన్నారు. కొన్ని మీడియా ఛానళ్ల విధానం వన్ సైడ్ లవ్ తరహాలో ఉందన్నారు. తాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని కేశినేని నాని తెలిపారు. వీటిని పట్టించుకోని మీడియా తనను వివాదాస్పద ప్రశ్నలు అడుగుతోందన్నారు. ప్రజలకు పనికి వచ్చే పనులను హైలెట్ చేసేలా మీడియా వ్యవహరించాలన్నారు. తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానని.. మీడియా వారే ఆలోచించుకోవాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలపై వార్తలు ఇస్తే... రాజకీయ ప్రశ్నలపై అప్పుడు తాను సమాధానం చెబుతానని కేశినేని నాని అన్నారు.