ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ యం. గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేతి వృత్తుల వారి సాంప్రదాయ హస్త కళా నైపుణ్యాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం రూ. 13 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.