మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ యం. గౌతమి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లో నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ యం. గౌతమి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వాడకంపై ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అనేది పరిశీలించాలన్నారు.