అనంతపురం నగరంలోని అర్బన్ లింక్ రోడ్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని సప్తగిరి సర్కిల్ లో అర్బన్ లింక్ రోడ్ భూసేకరణ పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్బన్ లింక్ రోడ్ భూసేకరణలో భాగంగా భవనాలు, మెజర్మెంట్స్ పనులు సక్రమంగా చేపట్టాలన్నారు.