ఉరవకొండ మండలం చిన్న ముష్టురు, కోనాపురం గ్రామంలో ఉన్న వేరుశనగ, కంది పంట పొలాలను వ్యవసాయ అధికారి శుభకరన్ సందర్శించారు. వర్షాభావ పరిస్థితులలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన రైతులకు వివరించారు. పది రోజుల్లో వర్షాలు రాకపోతే ఫైర్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వాటి నుండి పంటలను కాపాడుకోవాలంటే తాము సూచించిన విధంగా రసాయనాలు పిచికారీ చేయాలని వ్యవసాయ అధికారి తెలిపారు.