కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌తో హల్ చల్ చేస్తు మినిస్టర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తమ్ముడిని అంటూ రౌడీ షీటర్ దొంగల శ్రీధర్ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్ళితే.... రౌడీ షీటర్ దొంగల శ్రీధర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన తొందూరు శామ్యూల్ గేదెల వ్యాపారికి దొంగల శ్రీధర్ అనే వ్యక్తి పరిచయం ఉంది. ఈ క్రమంలో శామ్యూల్‌ను డబ్బులు ఇవ్వమని రౌడీ షీటర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో శామ్యూల్ హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీధర్ కదలికలపై నిఘా పెట్టారు. 25న రాత్రి 11 గంటలకు సమయంలో జంక్షన్లో శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్‌పై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉందని పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన రౌడీషీటర్‌ను రిమాండ్ కోసం పోలీసులు నూజివీడు కోర్టులో హాజరుపరిచారు.