ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాకు జీతాలు పెంచండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 26, 2023, 06:26 PM

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సత్యసాయి తాగునీటి నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పలువురు కార్మికులు ధర్నా చేపట్టారు. కొత్తచెరువు మండలంలోని కేశాపురం పంప్‌హౌస్‌ వద్ద నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తాము ఎన్నో ఏళ్లనుంచి సత్యసాయి పంప్‌ హౌస్ లో పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. అలాంటి తమకు సకాలంలో జీతాలు చెల్లించకపోతే కుటుంబాలు ఎలా పోషంచుకోవాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు బాబాసాబ్‌, శంకర్‌, భగవాన, కిష్టప్ప పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com