ధర్మవరం నూతన కూరగాయల మార్కెట్లో రూములు అద్దెకి తీసుకున్న వ్యక్తులు మున్సిపాలిటీకి గుడ్ విల్ అమౌంట్ ఇంకా పూర్తిస్థాయిలో చెల్లించలేదని వెంటనే చెల్లించాలని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. నూతన కూరగాయల మార్కెట్ నుండి ఇంకా రూ. 50 లక్షలు పైగా గుడ్ విల్ అమౌంట్ రావాల్సి ఉందన్నారు. వ్యాపారస్తులు స్పందించి బకాయి ఉన్న గుడ్ విల్ ని ఇచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ తెలిపారు.