శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడా కూడా డ్రాప్ అవుట్ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిఐఈఓ రఘునాథరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి పాసైన ప్రతి విద్యార్థి చదువు కొనసాగిస్తున్నాడా? లేదా? అనే సమాచారాన్ని మండలంలోని ఎంపీడీవోలు వెంటనే తెలియజేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థి కూడా కళాశాలకు తప్పనిసరిగా వెళ్లే విధంగా సచివాలయ సిబ్బంది కూడా సహాయ సహకారాలను అందించాలని తెలిపారు.