రాప్తాడు నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలుపొందారని ఆరోపించారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లతో గెలుపొంది పచ్చి అబద్దాలు చెబుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ప్రకాష్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు.