అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం లో శనివారం కుష్ఠు వ్యాధి విభాగం జిల్లా అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ తన సిబ్బందితో నెలవారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే కుష్ఠు సోకినా వారిని గుర్తించి చికిత్స అందించడం వలన అంగవైకల్యం నివారించ వచ్చని అన్నారు. అలాగే కుష్ఠు వ్యాధి వ్యాప్తిని అరికట్ట వచ్చని తెలిపారు.