కాళసముద్రం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పట్నం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రమీళ, డాక్టర్ నిరోష, డాక్టర్ లక్ష్మి బృందం, ఆశా కార్యకర్తలు, పాఠశాల హెల్త్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. 584మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా అందులో 35మంది విద్యార్థులకు మాత్రమే సాధారణ జలుబు, దగ్గు, 5మంది విద్యార్థులకు చర్మ సమస్యలు ఉన్నట్లు తెలిపారు.