ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన 32 ఏళ్ల సతీష్ కుమార్ కుష్వాహా అనే సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ తన భార్య చేయి నరికేశాడు. అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉండగా. భార్య ఉద్యోగం చేయడం సతీష్ కుమార్‌కు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్‌కు అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వచ్చింది. అక్కడ ఓ హోటల్లో ఆమెను మంచానికి కట్టేసి, దారుణంగా అరచేయి నరికాడు.