ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్ రఘుబీర్నగర్కు చెందిన సంజయ్ గుప్తా, అనితా గుప్తా దంపతుల కుమారుడు గతేడాది మరణించాడు. దాంతో కూతురినే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ ఏడాది తాను రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని కుమార్తె కోరింది. దాంతో తల్లిదండ్రులు చట్టా రైల్చౌక్లో ఫుట్‌పాత్‌పై పడుకున్న దంపతుల దగ్గరి నుంచి బాలుడిని ఎత్తుకెళ్లారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా సంజయ్ గుప్తా దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.