గంగానదిలో ఓ రాయి తేలుతూ వచ్చింది. దీనిని గమనించిన స్థానికులు నదిలో నుంచి రాయిని బయటకు తీశారు. రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండడంతో అది రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాయిగా భావిస్తూ ఓ నీటితొట్టెలో ఉంచి పూజలు చేస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న రాజ్‌ఘాట్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. రాయి దొరికిన ప్రాంతం పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.