5.24 కిలోల 45 బంగారు బిస్కెట్లను భారత సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని ఫ్రాంటియర్ పరిధిలోని 145వ బెటాలియన్ సిబ్బంది వాహన తనిఖీ నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చిన ఖాళీ ట్రక్కను తనిఖీ చేయగా అందులో బంగారు బిస్కెట్లు గుర్తించారు. వీటి ధర మార్కెట్లో రూ.3.07 కోట్లు ఉంటుందన్నారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని కోల్కతా కస్టమ్ కార్యాలయానికి బంగారాన్ని అప్పగించారు.