టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 నాణెం విడుదల సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతో రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీలో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవలే దొంగ ఓట్ల అంశంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.