తిరుమల శేషాచలం అడవుల్లో ఆపరేషన్ చిరుత ముగిసింది. నడకమార్గంలో నాలుగో చిరుత ఎట్టకేలకు ట్రాప్ లో చిక్కింది. వారం రోజులుగా చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ఎట్టకేలకు ఆదివారం రాత్రి ఏడో మైలు రాయి వద్ద బోనులో చిక్కింది. దీంతో ఇకపై భక్తులు నడక మార్గంలో ప్రశాంతంగా సంచరించే అవకాశం కలగనుంది. ఇప్పటివరకూ 4 చిరుతలు చిక్కగా ఆపరేషన్ చిరుత సక్సెస్ అయినట్లు అధికారులు తెలిపారు.