కేంద్రం ప్రవేశపెట్టనున్న ‘పీఎం విశ్వకర్మ యోజన’ పథకంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ డా.కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పథకం కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లోని సంప్రదాయ కుల వృత్తిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సెప్టెంబర్ 17న ప్రారంభించనున్నారు.