ఏపీ చిత్తూరు జిల్లా నగరిలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ఆయన, జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.680.44 కోట్లను జమ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.