జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమే లక్ష్యంగా జపాన్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (స్లిమ్) పేరిట జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ జాక్సా సోమవారం చంద్రుడిపైకి వ్యోమనౌక పంపించనుంది. హెచ్-2ఏ రాకెట్ నేడు నింగిలోకి దూసుకెళ్లనుంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో చేస్తున్న ఈ ప్రయోగం సఫలమైతే ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ చేసిన ఐదో దేశంగా అవతరించనుంది.