గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో దాదాపుగా 20 ఎస్సీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు టీడీపీ నేతలు తెలియజేసారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ..... వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ ఎస్సీల పొట్ట కొట్టిందని ఆరోపించారు. టీడీపీలో చేరిన వారిలో మోష, విజయ్‌కుమార్, ప్రసాద్, విజయ్, అబ్రహం, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బేస్తవారపేట మండల టీడీపీ అధ్యక్షులు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్, ఎంపీటీసీ భూపాల్‌రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు సైదులు, టీడీపీ నాయకులు రాము, అరుణ్‌కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.