రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ‘రాష్ట్రాన్ని రక్షించుకుందాం..దే శాన్ని కాపాడుకుందాం’ అన్న నినాదంతో సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర సోమ, మంగళవారాల్లో ఒంగోలు జిల్లాలో సాగనుంది. ఈనెల 17న విశాఖ ఉక్కు ఉద్యమ కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్ర సోమవారం ఉదయం 10 గంటలకు మన జిల్లాలోని మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్సెంటర్కు చేరుకోనుంది. అక్కడికి సమీపంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శిస్తుంది. అనంతరం 11 గంటలకు ఒంగోలు చేరుతుంది. నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటర్ నుంచి సీపీఐ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అక్కడ రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. రామకృష్ణ, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతోపాటు పలువురు రైతు నాయకులు పాల్గొంటున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మార్కాపురంలో బస్సు యాత్ర, ర్యాలీ, సభలు జరుగుతాయి. రాత్రికి అక్కడ బస చేసే యాత్ర బృందం మంగళవారం ఉదయం కనిగిరి చేరుతుంది.