రాష్ట్రంలో జాతీయ పార్టీ ఐన కాంగ్రెస్ ని అధికారంలోకి తేవలసిన అవసరం ఉందని కడప జిల్లా, మదనపల్లి నియోజనవర్గ కన్వీనర్ లీలాశ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం నిమ్మనపల్లె బస్థాండు సమీపంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అరాచకాలు, దౌర్జన్యాలు, కేసులు ఎక్కు వగా పెరిగాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలకన్నా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందన్నారు. మహిళలు, వృద్ధులు ఇప్పటికి కాంగ్రెస్ వైపే ఉన్నారని యువత కూడా మందుకు రావాలన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు.