కడప జిల్లా, పెద్దతిప్పసముద్రం పరిధిలోని టి.సదుం పంచాయతీకి చెందిన తలారి జయచంద్ర కుటుంబానికి కర్ణాటక రాష్ట్రం కంచార్లప ల్లెకు చెందిన అంజీ అనే వ్యక్తి ఆదివారం రూ.2లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. గత జూన మాసంలో అల్లనేరేడు కాయలు కోసేందుకు కూలీకి వెళ్లి విద్యుత షాక్కు గురై జయచంద్ర మృతి చెందాడు. అంత్య క్రియల రోజు బాధిత కుటుంబానికి రూ.50 వేలు ఇచ్చి ఆకుటుంబానికి అండగా నిలిచి తన సేవాభావాన్ని చాటుకున్న అంజి ఆదివారం టి.సదుం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు 2లక్షల రూపాయలను తన వంతు సహాయంగా ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.