నేడు ఉదయం ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేయడం జరిగింది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో నాణెం తయారు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.