ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇసుక దోపిడీపై 28, 29, 30 తేదీలలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మైలవరంలో ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు.ఈ క్రమంలో మైలవరంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ నేతలు దేవినేని ఉమా, దేవదత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.