ఉమ్మడి గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు,రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు నేడు లేఖ రాశారు. ఒక వార్డులో ఉన్న వాళ్ళను ఒక బూత్‌కు కాకుండా 8 వేరువేరు బూత్‌లకు కేటాయించారన్నారు. ఒక కుటుంబం సభ్యులను నాలుగు బూత్‌లలో చూపారని.. 150 మంది మృతుల ఓట్లను కూడా తొలగించలేదని వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు లేఖలో కోరారు.