చిత్తూరు జిల్లా, పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ పుంగనూరు ఇన్‌ఛార్జి చల్లా బాబుపై నమోదైన 7 కేసుల్లో నాలుగింటిలో ముందస్తు బెయిల్ రాగా.. మరో మూడు కేసుల్లో బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. అలానే దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ముగ్గురు కూడా నాలుగు వారాల పాటు అన్నమయ జిల్లాకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని షరతులు విధించింది.