పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్చార్జ్ బి. కె. పార్థసారథి సమక్షంలో సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ లోకి గొల్లపల్లి చాకలి శ్రీనివాసులు, చెరువుగేరి నంజుండ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రవిశంకర్, కన్వీనర్ సిద్దలింగప్ప, నాయకులు సుబ్బరాయుడు, సర్పంచ్ శ్రీనివాసులు, పాలడుగు చంద్ర, పాల్గొన్నారు.