టీటీడీ దేవస్థానంలో అన్యమతస్థులకు చోటు కల్పించడాన్ని బిజెపి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సందర్భంగా పాతపట్నంలో సోమవారం శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భక్తుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బిజెపి నాయకుల ఆధ్వర్యంలో చేపట్టారు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వారని, నేర చరిత్ర కలిగిన వారిని విధులు నుంచి తొలగించాలన్నారు.