అనకాపల్లి జిల్లా నాగులపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ శంకుస్థాపన కార్యక్రమము సోమవారం వేదపండితులు మంత్రోచారణలు మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొని వేదపండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ రాముని దీవెనలు ప్రజలందరికీ ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలోగ్రామ మాజీ సర్పంచ్ మళ్ల అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.