సత్యసాయి నీటి సరఫరా విభాగం కార్మికులు చేపట్టిన ఆందోళన సోమవారం నాలుగోరోజుకు చేరుకుంది. ధర్మవరం పట్టణంలోని పంప్ హౌస్ వద్ద కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నిరంతరం తాగు నీరు అందించడానికి పనిచేస్తున్న తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వ లేదని, ఇలా అయితే తాము కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు ఇవ్వాలని కోరారు.