మహాభారతంలో శ్రీ కృష్ణుడు శిశుపాలుడిని సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడి చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది తన చీర కొంగును చించి శ్రీ కృష్ణుడికి కట్టు కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి సోదరుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అప్పటి నుంచి రాఖీ పండుగ ప్రారంభమైనట్లు పురాణాలు చెబుతున్నాయి.