సింగపూర్ కు బియ్యం ఎగుమతికి భారత్ అనుమతించింది. ఆ దేశంతో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా అక్కడి వారి ఆహార భద్రతా అవసరాలు తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, బియ్యం దేశీయ ధరలను స్థిరంగా ఉంచేందుకు జులై 20 నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని భారత్ నిషేధించింది. అయితే, సింగపూర్ కు మాత్రం మినహాయింపు ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.