రక్షాబంధన్ అంటే కేవలం భారతీయుల పండుగ అని అనుకుంటారు. నిజానికి రాఖీ పౌర్ణమి అనేది ఇతర దేశాల ప్రజలు కూడా జరుపుకుంటారు. శ్రీలంక, యూఏఈ, మారిషస్, నేపాల్ తదితర దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. చాలా వరకు విదేశాల్లో నివసించే భారతీయుల ద్వారా ఈ సంస్కృతి విస్తరించింది. చాలా మంది విదేశీ యువతులు తమ అన్నదమ్ములకు రాఖీలు కడుతుంటారు.