చంద్రుని దక్షిణ ధ్రువంపై అధ్యయనానికి సైంటిస్టులు LIBS(లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్) అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఉపరితలంపై శక్తివంతమైన లేజర్ను షూట్ చేసినప్పుడు వెలువడే కాంతి ఆధారంగా మూలకాలను గుర్తించి డేటాను సైంటిస్టులకు పంపుతుంది. దీన్ని వారు విశ్లేషిస్తారు. ఈ పరికరాన్ని బెంగళూరులోని ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ (LEOS) అభివృద్ధి చేసింది.