పెళ్లి భోజనం తిన్న 150 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. బెలగావిలోని హిరేకోడిలోని చెకోడి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. విందుకు వచ్చిన వారంతా భోజనం చేసిన దాదాపు 150 మందికి రెండు గంటల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వాంతులు, విరేచనాలతో వీరందరినీ బెలగావిలో ఆసుపత్రిలో చేర్పించారు. భోజనాల్లో కల్తీ జరగడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నామని వైద్యులు తెలిపారు.