ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ 20 సదస్సు జరగనుండగా, పలు దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ పోలీసులు, పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. సమావేశాలు జరిగే వేదికల వద్ద ఏఐ ఆధారిత కెమెరాలు, సాఫ్ట్ వేర్ అలారమ్స్, డ్రోన్లు పహారా కాయనున్నాయి.