చంద్రబాబు భవిష్యత్కే గ్యారెంటీ లేదు..ఇక ప్రజలకు ఆయనేం ష్యూరిటీ ఉంటారని మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. టీడీపీ మునిగిపోయే పడవ అని మంత్రి ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎన్ని రకాలుగానైనా మాట్లాడతారు. అప్పట్లో ప్రత్యేక హోదా సంజీవినా అన్న మాటలు ప్రజలు మర్చిపోలేదని మంత్రి గుర్తు చేశారు. ప్యాకేజీ ఇస్తున్నారంటూ కేంద్ర పెద్దలను సన్మానించిన సంగతి కూడా అందరికీ గుర్తుందన్నారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని మళ్లీ మాటలు మార్చుతారని నిలదీశారు. టీడీపీ ఎప్పుడో ఖాళీ అయ్యింది..ఇక ఆ పార్టీలోకి ఎవరు వెళ్తారని ప్రశ్నించారు.