కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఎం ప్రజా జాతర బుధవారం ప్రారంభమైంది. పట్టణంలో సుందరయ్య నగర్ ప్రాంతాల్లో కరపత్ర ప్రచారం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద సిపిఎం పట్టణ కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నారు. సెప్టెంబర్ 4 తేదీ మండల కేంద్రం వద్ద జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరారు.